Illu illalu pillalu : తండ్రికిచ్చిన మాటకి కొడుకులు కట్టుబడి ఉంటారా!
on Nov 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -09 లో.. ప్రేమ వివాహం చేసుకోనని నాకు మాట ఇవ్వండని రామరాజు తన ముగ్గురు కొడుకులతో మాట తీసుకుంటాడు. మరొకవైపు వాడు మళ్ళీ చిన్న కొడుకుని అడ్డు పెట్టుకొని మన కుటుంబం పరువు తియ్యాలనుకున్నాడు. ఇంకొకసారి ఏమైనా నీ జోలికి వస్తే చెప్పు.. అప్పుడు వాడి సంగతి చెప్తానని ప్రేమకి భద్రవతి చెప్తుంది.
ఆ తర్వాత ప్రేమ నానమ్మ సిగ్గుపడుతూ నాకు తెలిసేలోవే మీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారని అంటుంటే.. ఛీ వాడితో నాకు ప్రేమ ఏంటని అంటుంది. మరొకవైపు పెద్దోడు తన ప్రేమించిన అమ్మాయిని గుర్తుచేసుకుంటూ ఉంటు ఏడుస్తుంటే.. చిన్నోడు వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. తను ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపించి ప్రేమ విషయం చెప్తాడు. మరి ఎందుకు నాన్నకి చెప్పలేదని అంటాడు. నాన్న అంటే భయమని పెద్దోడు అంటాడు. ఆ తర్వాత చిన్నోడు నడిపోని దగ్గరికి వెళ్లి.. నీ ప్రేమ విషయం నాన్నకి ఎందుకు చెప్పలేదు. నాన్న అంటే భయమా కోపంలో నాకు భయమేసిందని అంటాడు. అయిన ఇదంతా నీ వళ్లే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం వాళ్లేనని నడిపోడు కోప్పడతాడు. నేను దాన్ని ప్రేమించడం ఏంటని చిన్నోడు అంటాడు. ఆ తర్వాత రామరాజు తన కొడుకులు చెప్పిన మాట విన్నరు మురిసిపోతాడు.
మరొక వైపు తన ఇద్దరు అన్నలు బాధపడుతుండటం చూసి ఎలాగైనా వాళ్ళ బాధని పోగొట్టాలని చిన్నోడు అనుకుంటాడు. ఆ తర్వాత రామరాజు తన బామ్మరిదితో కలిసి డ్రింక్ చేస్తాడు. నువ్వు ఎందుకు బావ అలా నిర్ణయం తీసుకున్నావని అడుగుతాడు. కుటుంబానికి దూరమై మేం బాధపడ్డం.. అలా మా పిల్లలు పడకూడదు.. ప్రేమ పెళ్లిళ్లు మా ఇంట్లో జరగడానికి వీలు లేదని అంటాడు. తరువాయి భాగంలో వేదవతి కుటుంబం ఆరుబయట కూర్చొని ఉంటారు. వేదవతికి కాలు బెనుకూతుంది. దాంతో రామరాజు తన కాలుని పట్టుకొని ఆంటిమెంట్ రాస్తుంటే.. భద్రవతి కుటుంబం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read